హయత్నగర్, సెప్టెంబర్ 27: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు పుస్తెల తాడు తెంచుకొని పారిపోయాడు. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని హైమావతి కాలనీకి చెందిన లక్ష్మి గురువారం రాత్రి సిమ్ర ఆస్పత్రి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నది.
మార్గమధ్యలో ఉన్న గాంధీ విగ్రహం, ఆధార్ సెంటర్ మీదుగా వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.