నేరేడ్మెట్, జనవరి 16: బైకుపై వెనక కూర్చున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్స్నాచర్లు పుస్తెలతాడు తెంపుకొని వెళ్లిన ఘటన నేరేడ్మెట్లో జరిగింది. నేరేడ్మెట్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్లో నివాసం ఉంటున్న పూజిత (25) సంక్రాంతి పండుగ కోసం తల్లిదండ్రులు ఉంటున్న స్థానిక గీతానగర్కు వచ్చింది. అయితే గురువారం సాయంత్రం మూడున్నరకు చెల్లెలితో కలిసి తన ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై సోదరితో కలిసి మెడికల్ షాపుకు బయలుదేరారు. గీతానగర్ రోడ్డు నంబర్ 3లోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి వెనుకనుంచి ద్విచక్ర వాహనంపై వచ్చి బైకుపై వెనక కూర్చున్న పూజిత మెడలో ఉన్న 2.5 తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోయారు. దీంతో పూజిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.