కార్మికుల సమస్యల పట్ల కేంద్రం నిర్లక్ష్యం
కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జెండాను
మహేశ్వరం జోన్ బృందం, మే 1 : కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి తెలిపారు. మే డే సందర్భంగా కందుకూరు మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్యర్యంలో జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కార్మిక విభాగం అధ్యక్షుడు నవీన్ కుమార్, సీనియర్ నాయకులు సురుసాని సురేందర్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, డైరెక్టర్ సామ ప్రకాశ్‌రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తిక్, అందుగుల సత్యనారాయణ పాల్గొన్నారు.
- మండల సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా విద్యుత్ కార్యాలయం, మిషన్ భగీరథ కార్యాలయాలతో పాటు వివిధ గ్రామాల్లో జెండాలను ఆవిష్కరించారు. బాల్‌రాజ్, యాదగిరి, జంగయ్య, శ్రీరాములు, నర్సింహ, రాములు, జనార్దన్, శ్రీశైలం, అంజయ్య, సాయిలు, జంగారెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.
- తెలంగాణ భవన నిర్మాణ ప్లంబర్స్ కార్మిక సంఘం ఎల్బీనగర్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని లేబర్ అడ్డా సమీపంలో వందలాది మంది కార్మికులతో కార్మిక దినోత్సవ వేడుకలను నిర్వహించి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి, రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి శేఖర్‌రెడ్డి, అధ్యక్షుడు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్‌బాబు, కోశాధికారి మల్లయ్య, ఉపాధ్యక్షులు యాదగిరి, తిరుమల్‌రెడ్డి, చంద్రశేఖర్, కార్మికులు పాల్గొన్నారు.
- ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో ఆర్కేపురం చౌరస్తాలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ హాజరై జెండాను ఎగరవేశారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బందిని సన్మానించి నగదు బహుమతి అందజేశారు.
- జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీలో టీఆర్ఎస్కేవీ నియోజకవర్గం అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అరుణ పథాకం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, టీఆర్ఎస్ నాయకులు ఉష్కమూరి నిరంజన్, బాల్‌రాజ్, నర్సింహులు, సోమ్నాద్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
- బాలాపూర్ మండల పరిధిలోని ఏఆర్‌సీఐ, ఆర్సీఐ, బాలాపూర్ చౌరస్తా, మీర్‌పేట చౌరస్తా, బడంగ్‌పేట, తదితర ప్రాంతాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆటో కార్మిక యూనియన్, మున్సిపల్ కార్పొరేషన్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర చారి అరుణ పతాకాలను ఎగుర వేసి ర్యాలీలు తీశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నరేందర్, వెంకట్రామిరెడ్డి, అంజయ్య, బాలయ్య, కిశోర్, దాసరి బాబు, దశరత, శ్రీనివాస్ గౌడ్, కృష్ణయ్య, జగన్, శ్రీరాములు, సురేశ్, నర్సింహ, యాదయ్య తదితరులు ఉన్నారు.
- టీఆర్ఎస్ కార్మిక విభాగం జెండాను జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్తో కలిసి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు సంజయ్, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్యాద రాఘవేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనందం, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కంది రమేశ్, రవీందర్‌నాయక్, నవీన్, దుడ్డు కృష్ణ, దిద్దెల అశోక్‌కుమార్, వీరిబాబు, నవీన్, కటికెల శ్రీనువాస్, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల రవికుమార్ ఆధ్వర్యంలో తుక్కుగూడలో భారీ ర్యాలీ నిర్వహించి.. అనంతరం సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరమేశ్, వెంకటేశ్, కృష్ణ, శేఖర్, యాదయ్య, రవి, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.
- తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్, హార్డ్‌వేర్‌పార్కు, తుక్కుగూడలో కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి మేడే జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దత్తూనాయక్, మండల ప్రధాన కార్యదర్శి రాజు, నాయకులు జంగన్న, గణేశ్, గోపాల్, నగేశ్, యాదిలాల్, యాదన్న, రవి, బ్రహ్మచారి, యాదయ్య, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ‘మే డే’ ఉత్సవాలు
చాదర్‌ఘాట్, మే 1: మే డే ను పురస్కరించుకుని ఏక్తా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఆదివారం ఏక్తా వెల్ఫేర్ అసోసియషన్ అధ్యక్షుడు రాజేశ్ యాదవ్ పారిశుధ్య కార్మికులతో కలిసి ఉత్సవాలను నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Centre
- Labour
- neglecting
- rights
RELATED ARTICLES
తాజా వార్తలు
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

