ఐక్యతతో హక్కులు సాధించుకోవాలి
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటుకున్నారు.
- వాడవాడలా మేడే ఉత్సవాలు
- జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు
- ప్రజా వ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- మోదీని గద్దె దించాలి.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి
బడంగ్‌పేట/మహేశ్వరం/కందుకూరు/ఆర్కేపురం/పహాడీషరీఫ్, మే 1 : ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో మేడే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఆయా యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు జెండాలను ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటుకున్నారు. కార్మికుల హక్కుల సాధనకు ఐక్యంగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
- ప్రధానమంత్రి నరేంద్రమోదీని గద్దె దించి.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి ధీమా వ్యక్తం చేశారు. బాలాపూర్ మండల పరిధిలో, తుక్కుగూడ మున్సిపాలిటీలో సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బాలాపూర్, మీర్‌పేట, బడంగ్‌పేట, జిల్లెలగూడ, తుక్కుగూడలో అరుణ పతాకాలను ఎగురవేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన అమర వీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు దాసరి బాబు పెంటయ్య, యాదగిరి, ఎంకయ్య, మల్లికార్జున్, యాదగిరి, నర్సింహ, జగన్, జీవన్, బాలకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు శంకర్, రజియా, రాజు, తదితరులు ఉన్నారు.
- మహేశ్వరం మండల కేంద్రంలో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షుడు సంజయ్ దేశ్‌ముఖ్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో (బీఆర్టీయూ) బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, ఆనందం, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, మెడికల్ హెల్త్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ రఫీయుద్దీన్, నాయకులు నవీన్, రాములు, అశోక్, కుమార్, ప్రభాకర్, కృష్ణ, బాలయ్య, శ్రీనువాస్ కార్మికులు పాల్గొన్నారు.
- సీఐటీయూ ఆద్వర్యంలో.. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రయ్య జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తునాయక్, నాయకులు రాజు, దేవేందర్‌గౌడ్, గణేశ్, శ్రీరామ్, జోసెఫ్, రమేశ్, సాయి, యాదగిరి, చెన్నయ్య పాల్గొన్నారు.
- కందుకూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు నవీన్ కుమార్, సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాంచందర్, శ్రీనివాస్, బుట్టి బాల్‌రాజ్, కుమార్, సరస్వతి, లక్ష్మీబాయి, సతీశ్ సిద్దు, శేఖర్, అంజయ్య, అరుణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, యూనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, చిర్ర సాయిలు, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్‌రెడ్డి, సదానంద్‌గౌడ్, సామయ్య, కృష్ణరెడ్డి, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
- శ్రీరామకాలనీలో బీఆర్టీయూ నియోజకవర్గం కార్మికసంఘం అధ్యక్షుడు గౌడెల్లి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్మిక జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్, బీఆర్ఎస్, బీర్టీయూ కార్మిక సంఘం నాయకులు నర్సింహ, బాలరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- ఆర్కేపురం చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం మాజీ ఉపాధ్యక్షులు మారోజు రామాచారి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దగోని వెంకటేశ్‌గౌడ్, నాయకులు వంగూరి యాదవరెడ్డి, సాజీద్, జగిని రమేశ్‌గుప్తా, వల్లూరి రమేశ్, శ్రీరాములు, అల్లావుద్దీన్ పటేల్, దుబ్బాక శేఖర్, పాషా, పి.ఎల్లన్న, పబ్బు శ్రీనివాస్, నవీన్, యాదమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

