ఎమ్మెల్యే ముఠా గోపాల్
భోలక్‌పూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కవాడిగూడ, జనవరి 7: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్ ఎస్కే పాయింట్ నుంచి శేఖర్‌రెడ్డి దవాఖాన వరకు రూ. 14 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, సుప్రీం హోటల్ నుంచి కత్నీకాంఠ వరకు రు. 16 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్ తహ, జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ నగర విభాగం నాయకుడు ముఠా జయసింహ, నవీన్‌కుమార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ భోలక్‌పూర్ డివిజన్లో శిథిలమైన తాగునీటి, డ్రైనేజీ పైప్లైన్లను తొలగించి, రూ. 20 కోట్లతో నూతన పైప్‌లైన్ నిర్మాణ పనులను పూర్తి చేసి కలుషిత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంపై చర్యలు తీసుకున్నామని అన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మహ్మద్ షరీపొద్దీన్, భోలక్‌పూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, సీనియర్ నాయకులు జునేద్ బాగ్ధాది, మాజీ కార్పొరేటర్ రహ్మత్ తదితరులు పాల్గొన్నారు.
బాపూజీనగర్ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా..
ముషీరాబాద్, జనవరి 7: ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. శుక్రవారం జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బాపూజీనగర్‌లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డ్రైనేజీ పైపులైన్ నిర్మాణానికి రూ. 9 లక్షలు మంజూరు చేయించామన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వీధి దీపాలను వెంటనే తొలగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ కృష్ణమోహన్, జీహెచ్ఎంసీ ఏఈ తిరుపతి, టీఆర్ఎస్ సీనియర్ నేతలు నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, ముఠా జయసింహ, సోమసుందర్, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి, నాయకులు ఎయిర్టెల్ రాజు, గోవింద్, శోభ, అజయ్ పాల్గొన్నారు.