RS Praveen kumar | 17 సంవత్సరాల బాలికకు ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేసిన ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సదరు బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కాగా ఈ విషయమై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరధ్ మీద పోక్సో కేసు నమోదు చేయడానికి ఎందుకంత అలస్యం చేశారని ప్రశ్నించారు.
17 సంవత్సరాల బాలికకు బండి సంజయ్ కొడుకు భయపడతాడని ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు..? ఆయన మహీంద్రా యూనివర్సిటీలో నాయక్, ఖల్నాయక్, దబాంగ్ రేంజ్లో గొడవలు చేశాడని.. మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులను కొడితే బండి సాయి భగీరధ్ మీద రెండు ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఇలాంటి బండి సాయి భగీరధ్ 17 ఏళ్ల మైనర్ బాలికకు భయపడుతాడా..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
V6లో పని చేసి ఇటీవల బీజేపీలో చేరిన ఒక జర్నలిస్ట్ బండి సంజయ్ కొడుకు కేసుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని.. నిన్న రాత్రి 10 గంటలకు అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండగా ఈ V6 జర్నలిస్ట్ కేసు డ్రాప్ చేయండని రాయబారం జరిపాడన్నారు. బండి సంజయ్ ప్రోద్బలంతో ఏప్రిల్ నెలలో ఈ అమ్మాయి మీద కేసు పెట్టారు. బండి సంజయ్ కొడుకు ఆ కుటుంబానికి రూ.50 వేలు ఇచ్చానని FIRలో రాశారు.. అవి ఇచ్చినట్లు కనీసం ఆధారం కూడా చూపించకుండా బట్టకాల్చి మీద వేశారని ఆరోపించారు.
బండి సంజయ్ కొడుకు మీద కేవలం 2,3 సంవత్సరాలు శిక్ష పడే కేసులు పెట్టారని.. BNSS సెక్షన్ 74, 75, సెక్షన్ 11, 12 పోక్సో యాక్ట్ లాంటి కేసు అంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ విధంగా మన పుత్రరత్నం బండి సాయి భగీరథ్‌కు చిన్న తప్పే చేశావని.. నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చు, నువ్వు ఎంత మంది అమ్మాయిలను అయినా నాశనం చేయొచ్చు అన్నట్లు కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు.
బండి సంజయ్ కొడుకు మీద కేవలం 2,3 సంవత్సరాలు శిక్ష పడే కేసులు పెట్టారు
BNSS సెక్షన్ 74, 75, సెక్షన్ 11, 12 పోక్సో యాక్ట్ లాంటి కేసు అంటే స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టారు
ఈ విధంగా మన పుత్రరత్నం బండి సాయి భగీరథ్ కు చిన్న తప్పే చేశావని.. నీకు స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చు, నువ్వు… https://t.co/0jiUilLShi pic.twitter.com/MCn8oa8evh
— Telugu Scribe (@TeluguScribe) May 9, 2026
Ravi Teja | ఫుల్ స్వింగ్‌లో రవితేజ ‘ఇరుముడి’.. షూటింగ్ చివరి దశకు చేరిన మాస్ మహారాజ మూవీ!