Amit Shah | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలతో అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డిపై మొఘల్‌పురా పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని పోలీసులు పేర్కొన్నారు. అమిత్ షాపై నమోదైన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ తమ చీకటి పొత్తును కొనసాగిస్తూనే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొన్న సింగరేణి బొగ్గు గనులు వేలంకు బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించకుండా మౌనం వహిస్తుందన్నారు. తాజాగా అమిత్ షాపై నమోదైన కేసును కొట్టివేడయం.. ఇలా కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Amitshahcase