బంజారాహిల్స్,జూన్ 23 : బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బండి భగీరథ్‌పై నమోదయిన పోక్సో కేసు సందర్భంలో బాధితుల పక్షాన నిలబడి పోరాడిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని మహాన్యూస్ చానెల్లో అడ్డగోలు హెడ్డింగ్స్‌తో కథనాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.
ఈ చానెల్ ప్రసారం చేసిన కథనాలు దళిత వర్గానికి చెందిన బీఆర్ఎస్ కీలక నేత డా. ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, సమాజంలో వివిద వర్గాలను రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని పాడుచేసేలా ఉన్నాయని సీహెచ్.ఉదయ్‌కుమార్ అనే వ్యక్తి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు ఘటనా స్థలం జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోకి వస్తున్నందున కేసును జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు నిందితుడు మహా న్యూస్ వంశీపై బీఎన్ఎస్ 352 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.