బంజారాహిల్స్, జూలై 9: పబ్‌లో పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వెళ్లే క్రమంలో కారు పల్టీ కొట్టిన ఘటనలో నలుగురు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కొంపల్లిలో నివాసం ఉంటున్న ప్రణవ్(27) రియల్ ఎస్టేట్ వ్యాపారి. మంగళవారం రాత్రి కొండాపూర్‌లోని క్వేక్ ఎరీనా పబ్‌లో తన స్నేహితులు అభిషేక్ కుమార్(26), అశిష్(26), సీహెచ్.అనురాగ్(26)తో కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత కొండాపూర్ నుంచి కొంపల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి కేబీఆర్ పార్క్‌కు వెళ్తున్న క్రమంలో కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని యువకులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కారు బోల్తా పడిన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కారు నడిపిన అభిషేక్‌తో పాటు మిగిలిన వారందరికీ బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. వారంతా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తెలిసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
పార్టీ ముగించుకుని అర్థరాత్రి దాటిన తర్వాత వారంతా కారులో ఇంటికి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్కువైపుకు వెళ్తున్న క్రమంలో అదుపుతప్పిన కారు జీహెచ్ఎంసీకి చెందిన ఫుట్‌పాత్‌ను డీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని యువకులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారు నడిపించిన అభిషేక్ కుమార్‌తో పాటు మిగిలిన వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా వారంతా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు వారందరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.