బంజారాహిల్స్,జూన్ 5: ఏపీలో ఎన్నికల(AP elections) ఫలితాలు వెల్లడయ్యాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (Telangana Bhavan) వద్దకు వచ్చి రెచ్చగొట్టేలా(Nuisance) ప్రవర్తించిన టీడీపీ నాయకులపై(TDP leaders) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంతమంది కార్యకర్తలు మంగళవారం సాయంత్రం బంజా రాహిల్స్‌లోని తెలంగాణ భవన్వద్దకు కారులో వచ్చి రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలను ప్రదర్శిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడ్డారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేసిన మియాపూర్‌కు చెందిన టి.వెంకటకృష్ణారెడ్డి, జి.మహేష్ అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ భవన్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివరాజ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు నిందితులపై ఐపీసీ 188,153(ఏ)(బీ),185(ఏ) మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.