khaja Moinuddin| దుండగుల చేతిలో హత్యకు గురైన అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేయగా.. ఖాజా మొయిజుద్దీన్‌ను పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారని తెలిసిందే. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయిజుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మాటు వేసి నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో కారుతో గుద్ది హత్య చేసినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు.
కాగా దుండగుల కోసం ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు కొనసాగిస్తున్న పోలీసులు అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్యలో వాడిన కారు యజమానిని గుర్తించారు. సదరు కారు యజమాని తాను గత కొద్ది నెలల క్రితం కారు అమ్మేశానని, కొన్నవారు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదని తెలుపగా.. పోలీసులు ఆ కారు కొన్న వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం.
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాటం..
హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ఉన్న ఖాజా మొయిజుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన తండ్రి మొయిజుద్దీన్ హత్యకు కారణం కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖానే అని అతని కుమారుడు ఫర్హాన్ ఆరోపించాడు.