శామీర్ పేట, నవంబర్ 24: శామీర్పేట కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చికుకుని దగ్ధమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. శామీర్పేట పోలీసులు, ఫైర్ సిబ్బంది అకడికి చేరుకునేలోపే వాహనం పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పిన అనంతరం డ్రైవర్ సీటులో ఒక వ్యక్తి అస్థిపంజరం లభించింది. పోలీసుల ప్రాథమిక పరిశీలనలో ఆ కారు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (టీఎస్03 ఎఫ్డీ 7688)గా గుర్తించారు.
హనుమకొండ జిల్లా జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (30), ఈ69 డిజిటల్ న్యూస్ చానల్ పార్ట్నర్. హైదరాబాద్ వచ్చి సోమవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరినట్లు తెలుస్తోంది. వాహనం రో డ్డుకు ఓ వైపున ఆగి ఉన్న సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తున్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.