Secunderabad : సికింద్రాబాద్ జింఖాన మైదానం వద్ద కారులో మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి పార్క్ చేసి ఉన్న కారులో మంటలు వ్యాపించాయి. తీవ్రతకు కారు ఇం జిన్ బాగం పూర్తిగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మటల్ని ఆర్పివేశారు.
అయితే.. మంటలు చెలరేగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడతో తప్పిన ప్రమాదం. కారు ఎవరిది? ప్రమాదానికి కారణం ఏంటీ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.