హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో తృటిలో ప్రాణ నష్టం తప్పింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ అందులోనుంచి దిగిపోయాడు. క్రమంగా మంటలు కారు మొత్తానికి వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.