హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్ పరిధిలోని బీకే గూడ చౌరస్తా వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు.. ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బైక్లు, రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కారును సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.