మియాపూర్, అక్టోబర్ 31 : శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మద్దతుగా హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్‌గౌడ్‌లు తమ తమ డివిజన్లలో పార్టీ శ్రేణులతో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన నెలకొంటున్నదని, బీఆర్ఎస్కే తమ ఓటుఉ అంటూ నినదిస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని, ప్రజలు ఓటుతో తమ మద్దతును తెలపాలని కార్పొరేటర్లు శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, విప్కుమారుడు పృథ్వీ గాంధీలు కోరారు.
కారు గుర్తుకే ఓటేద్దాం.. గాంధీని భారీ మెజార్టీతో గెలిపిద్దాం..
కొండాపూర్, అక్టోబర్ 31 : కారు గుర్తుకే ఓటేద్దాం… అరెకపూడి గాంధీని భారీ మెజార్టీతో గెలిపిద్దామంటూ.. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథరెడ్డి మంగళవారం డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం, అభివృద్ధిల కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, మరోసారి ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీని ముచ్చటగా మూడోసారి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పదవి కోసం ప్రతిపక్ష నాయకులు చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, మంచి చేసే వాళ్ళను తప్పకుండా ఆధరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.