సిటీబ్యూరో: భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో శుక్రవారం ఆర్ట్ అండ్ కాలిగ్రఫీ ఎగ్జిబిషన్ కొలువుదీరింది. ఈ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.
గవర్నర్‌కు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ జొన్నలగడ్డ స్నేహజ ఎగ్జిబిషన్ సంబంధిత అంశాలను వివరించారు. ఈ ఏడాది ముగింపు వరకు ఎగ్జిబిషన్ సందర్శనకు అందుబాటులో ఉంటుందని స్నేహజ తెలిపారు.