Cab Drivers Protest | సిటీబ్యూరో, మార్చి 21 ( నమస్తే తెలంగాణ) :13 రోజులుగా క్యాబ్ డ్రైవర్లు విమానాశ్రయానికి ట్రిప్పులు నిలిపివేయడంతో దేశీయ, విదేశీయ ప్రయాణికులు ఇక్కట్ల పాలవుతున్నారు. విమానాశ్రయం వద్ద క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవడంతో వాళ్లంతా వాహనాల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులకు క్యాబ్ సర్వీసులు అందుబాటులో లేవని..ప్రత్యామ్నాయాలు చూసుకోవాలంటూ విమానాశ్రయ సిబ్బంది సూచిస్తున్నారు.
కాగా ఓలా, ఉబర్, ర్యాపిడోలు ట్రిప్పు ధరలు తగ్గించి డ్రైవర్లకు అన్యాయం చేస్తున్నదని తెలంగాణ క్యాబ్ అసోసియేషన్, గిగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పారు. ఇప్పటి వరకు 58వేల మంది డ్రైవర్లు ఎయిర్పోర్ట్ రైడ్ బహిష్కరణలో పాల్గొన్నారని వివరించారు. మరోవైపుఇదే అదునుగా భావించిన రెంటల్ కార్ల నిర్వాహకులు ప్రయాణికుల దగ్గర నుంచి అధికంగా వసూలు చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రభుత్వమే యాప్ తీసుకొస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం మొండి చేయిచ్చిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.