సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఆర్బీఐ, ఏఐ ద్వారా సిఫారస్ చేసిన స్టాక్స్‌ను కొని అధిక లాభాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉపాధ్యాయురాలికి సైబర్‌నేరగాళ్లు రూ. 26.5 లక్షలు బురిడీ కొట్టించారు. మీర్పేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలి వాట్సాప్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేయడంతో పేటీఎం స్టాక్స్ పేటీఎం మనీ క్యూఐబీ ట్రేడింగ్ కంపెనీ లైట్ ఆఫ్ నాలెడ్జ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌లో నెంబర్ యాడ్ అయ్యింది. గ్రూప్ అడ్మిన్‌గా యశశ్విని జిందాల్ అనే పేరుతో ఒక మహిళా ఫోన్ చేసింది, మీకు ట్రేడింగ్‌లో ఎలాంటి సహాయం కావాలన్నా మేం చేస్తామంటూ సూచనలు చేసింది. తమ కస్టమర్ కేర్ నెంబర్లు ఉన్నాయంటూ మూడు నెంబర్లను పంపించింది.
ఆ తరువాత ఆర్బీఐ, ఏఐ సూచించిన స్టాక్స్ కొంటామని దానితో మంచి లాభాలొస్తాయంటూ నమ్మించారు. వెబ్సైట్ లింక్ ఇచ్చి అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని సూచనలు చేశారు. దీంతో రూ. 26.5 లక్షలు మోసపోయానని, తనకు వచ్చే లాభంలో కమీషన్ మినహాయించుకొని ఇవ్వాలంటూ బాధితురాలు కోరింది. ఆమెకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఇదంతా మోసమని గుర్తించి, రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.