ఉప్పల్, ఆగస్టు 14: బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్‌లోని భగాయత్‌లో ఆదివారం పట్కారీ కుల భవన శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమంలో మంత్రి కమలాకర్‌తోపాటు ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమలాకర్ మా ట్లాడుతూ.. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం 41 కుల సం ఘాలకు రూ.95.25 కోట్ల విలువైన 82.3 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్కో భవన నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరు చేశారని చెప్పారు.
పట్కారీ కులస్థులు అన్నిరంగాల్లో రాణించాలని ఆకాంక్షిం చారు. ఆత్మగౌరవ భవనాలు తమ నియోజక వర్గంలో ఉం డటం గర్వంగా ఉన్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్కారీ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ రవీందర్, మాజీ ఎమ్మెల్యే షికారి విశ్వనాథం, అశోక్, రామచంద్ర, యశ్వంత్రావుపవార్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిట్ వినీతాపవన్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, డాక్టర్ అశోక్ పాల్గొన్నారు.