హైదరాబాద్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో(Dundigal police station) దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. మల్లంపేటలోని ఓ అపార్ట్మెంట్లో శారద(50) అనే మహిళను (Woman murder)దుండగులు దారుణంగా హత్య(Brutal murder) చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత కొద్ది రోజులుగా పోలీసుల నిఘా కొరవడడంతో దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గస్తీని పెంచాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ప్రజారోగ్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ మండిపాటు
KTR | అనుముల తిరుపతి రెడ్డి గారు.. ఆ కిటుకేదో సామాన్యులకు కూడా చెప్పండి: కేటీఆర్