యువకుడి దారుణ హత్య
బాబాయి కుమార్తె (చెల్లెలి)తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని, తన తండ్రితో గొడవకు దిగడాన్ని ప్రశ్నించిన ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడి చి హత్య చేసిన ఘటన మారేడ్‌పల్లిలో జరిగింది. నిందితుల వద్ద నుంచి కత్తి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి ఇన్స్పెక్టర్ నోముల వెంకటేష్‌లు వెల్లడించారు.
మారేడ్‌పల్లి, జూన్ 2: బాబాయి కుమార్తె (చెల్లెలి)తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని, తన తండ్రితో గొడవకు దిగడాన్ని ప్రశ్నించిన ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న నలుగురు వ్యక్తులు అతన్ని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడి చి హత్య చేసిన ఘటన మారేడ్‌పల్లిలో జరిగింది. నిందితుల వద్ద నుంచి కత్తి, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి ఇన్స్పెక్టర్ నోముల వెంకటేష్‌లు వెల్లడించారు.
ఈస్ట్ మారేడ్పలిక్లి చెందిన పరుశురాం ప్లవర్ డెకరేషన్ వ్యాపారి. అతని కుమారుడు శ్రావన్ తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రామ్‌దాస్ కుమారుడు పంగ సాయి నిఖిల్ (22) గంజాయికి అలవాటు పడి జులాయిగా తిరుగుతున్నాడు. గత నెల 31న శ్రవన్ కుటుంబ సభ్యులందరూ భువనగిరిలోని ఓ దేవాలయంకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అదే రోజు రాత్రి మృతుడి చెల్లెలిని నిందితుడు సాయి నిఖిల్ వేధింపులకు గురి చేయడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు.
ఈ క్రమంలో మృతుడి తండ్రి పరుశురాం అక్కడికి చేరుకొని వారిని మందలించి వెళ్లగొట్టారు. జరిగిన విషయాన్ని శ్రవన్కు కుటుంబ సభ్యులు చెప్పగా.. తన చెల్లెలు, మా నాన్నతో ఎందుకు గొడవ పడ్డావ్ అని సాయి నిఖిల్‌ను ప్రశ్నించగా.. ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అప్పటికే మద్యం, గంజాయి మత్తులో ఉన్న అదే ప్రాంతానికి చెందిన బండి ఆనంద్ అలియాస్ (19), చింతకాయల సాయినాథ్ (26), రాసేపల్లి రమేష్ (20) సహకారంతో సాయి నిఖిల్ కత్తితో శ్రవణ్‌పై 8 చోట్ల దాడి చేశాడు. శ్రవణ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 1న మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం నిందితులు అరెస్ట్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

