పేదల ఇండ్లు కూల్చితే తిరుగుబాటు తప్పదు
మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్లు హెచ్చరించారు.
- బీఆర్ఎస్వీ నేత కడారి స్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 6: మూసీ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి, కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్లు హెచ్చరించారు. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు గుండుమల్ల పాండుగౌడ్ ఆధ్వర్యంలో మూసీ ప్రజలకు మద్దతుగా సోమవారం కొత్తపేట డివిజన్లోని జనప్రియ అవెన్యూ మూసీ పరివాహక కాలనీలో పర్యటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గుండుమల్ల పాండు గౌడ్ మాట్లాడుతూ మూసీ తీర ప్రాంత ప్రజలకు బరోసా కల్పించేందుకే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మూసీ బాధితులకు అండగా పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్, మాజీ అధ్యక్షుడు రాగిరి ఉదయ్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు జహీర్‌ఖాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయగౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర మాజీ కార్యదర్శి జాహెద్, ఎల్బీనగర్ ఉపాధ్యక్షుడు సచిన్ బోస్లే, బీఆర్ఎస్వీ నాయకులు బాలు, ప్రభాకర్, లింగాల నిఖిల్ గౌడ్, హేమంత్ పాల్గొన్నారు.
అంబర్‌పేటలో బీఆర్ఎస్వీ పోరుబాట
గోల్నాక, ఏప్రిల్ 6: మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న దోపిడీని అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామియాదవ్ అన్నారు.సోమవారం బీఆర్ఎస్సీ ఆధ్వర్యంలో అంబర్‌పేట నియోజకవర్గం మూసీ పరివాహక ప్రాంతాల్లో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. గోల్నాక డివిజన్ లంకతో పాటు పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి మూసీ పరివాహక ప్రాంత బాధితులకు కరపత్రాలను అందజేస్తూ వారికి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా స్వామియాదవ్ మాట్లాడుతూ…మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని కాంగ్రెస్ సర్కార్ లూటీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పడాల సతీష్, కోతి విజయ్, సింగ వెంకట్, రాజేష్ నాయక్, అవినాష్, మిథున్ ప్రసాద్, నాగేందర్, శ్రీకాంత్, రహ్మత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

