BRSV | మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన బీఆర్ఎస్వీ.. గెల్లు శ్రీనివాస్, కడారి స్వామి, తుంగ బాలు అరెస్టు
BRSV | అక్రమ కేసులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు.
BRSV | అక్రమ కేసులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కడారి స్వామి యాదవ్, తుంగ బాలు, చాటారీ దశరథ్, నర్సింగ్, యశ్వంత్, నాగేందర్ రావు, నర్సింగ్, రాజు ,కిరణ్, రాజు యాదవ్, రవి కిరణ్, శ్రవణ్, జూపల్లి రాము, కనీష్ లను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా 65 సంవత్సరాలు దాటిన కేసీఆర్‌ను పట్టుకొని సిట్ విచారణ పేరుతో వేధించడం మూర్ఖత్వమని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన చర్య అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలను దృష్టి మళ్లించడానికే సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి పాలన 25 మాసాలు 65 మోసాలుగా సాగుతున్నదని గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాష్ట్రంలో స్కీముల పేరిట స్కామ్ లకు పాల్పడుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి సిట్ పేరిట డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని మండిపడ్డారు. నిరుద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. అవీనీతి, కుంభకోణాలను బయటపెడుతున్నందుకు కేసులు, నోటీసులు, విచారణలు అంటూ ఇచ్చిన హామీలు ప్రకటించిన గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ కాలం వెళ్లదీస్తున్నదని మండిపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

