మియాపూర్ : చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం పార్టీ శ్రేణులు చేసిన కృషి అమోఘమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌కు చెందిన బీఆర్ఎస్ (BRS) నేతలు , పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే గాంధీని బుధవారం ఆయన కార్యాలయంలో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి , సంక్షేమలతో పాటు పార్టీ శ్రేణుల కష్టం వెరసి ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించ బోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎన్నో మార్పులు, చేర్పులు జరిగినా గులాబీ శ్రేణులు ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా నిజమైన సైనికుల్లా ఎన్నికల్లో పని చేశారని కొనియాడారు. పార్టీకి కార్యకర్తలే బలమని వారి కృషి వల్లే నియోజకవర్గంలో మూడుసార్లు తనకు అఖండ మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీని మరింత పరిపుష్టం చేస్తానని హామీ ఇచ్చారు. మున్ముందు ఎన్నికలలోనూ పార్టీ శ్రేణులు ఈ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, దుర్గారావు , సుబ్బారావు , రాంమోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, దేవాయ వెంకటేశ్వర్రావు, వసంత్, అశోక్ , రాజేష్ పాల్గొన్నారు.