కంటోన్మెంట్, మే 29: కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణతో పాటు సభ్యత్వ నమోదుకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తరగతుల కార్యక్రమం ఆదివారం క్లాసిక్ గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు వెల్లడించారు.