నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు పూర్తయినా ఏ ఒక హామీని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా వంచించింది. కాంగ్రెస్ మార్ 420 మోసాలు, అవినీతి, హామీల బకాయిలపై గులాబీ దళం కదనభేరి మోగించింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రేటర్ రాజధాని వ్యాప్తంగా కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, నాయకులు సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేస్తారు. నేటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, ప్రజలను మోసం చేసిన తీరుపై ధర్నాలు నిర్వహించనున్నారు.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు పూర్తయినా ఏ ఒక హామీని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా వంచించింది. కాంగ్రెస్ మార్ 420 మోసాలు, అవినీతి, హామీల బకాయిలపై గులాబీ దళం కదనభేరి మోగించింది.