KTR | సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ) : గాంధీ వైద్యశాలలో ఒక నెలలోనే 50 మంది పసిగుడ్డులు (శిశువులు), 14 మంది బాలింతలు చనిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ..ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ వైద్యశాలలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా? అని బుధవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తప్పు చేయకపోతే సర్కారు ఈ లెక్కలను ఎందుకు దాస్తున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆ తల్లీ, బిడ్డల ఉసురు మీకు తగలదా’? అని అన్నారు. ఒక్క గాంధీలోనే ఇన్ని మరణాలుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే.. భయంగా ఉన్నదన్నారు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, డెలివరీ అయితే కేసీఆర్ కిట్లు, సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తూ.. తల్లీ, బిడ్డలను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థలను రూపొందించి అమలు చేసిందని గుర్తు చేశారు.
మాతా శిశుమరణాల రేటును తగ్గించేందుకు బీఆర్ఎస్ సర్కారు కృషి చేసిందన్నారు. ‘మరీ.. ఈ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? పాలన గాలికి వదిలి, ప్రచార ఆర్భాటాలు, విగ్రహ రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది’. అని కేటీఆర్ మండిపడ్డారు. గాంధీలో ఒక్క ఆగస్టు నెలలోనే ఇన్ని మరణాలపై సీఎస్ శాంతికుమారి స్పందించి విచారణ జరిపించాలన్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ) : గాంధీ వైద్యశాలలో ఒక నెలలోనే 50 మంది పసిగుడ్డులు (శిశువులు), 14 మంది బాలింతలు చనిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ..ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ వైద్యశాలలో ఇంత విషాదం ఎవరి పాపం? ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదా? ఆ తల్లుల గర్భశోకానికి జవాబు ఉండదా? అని బుధవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.