BRS | ఉచితం ఉత్తమాటేనా.. ఎల్ఆర్ఎస్పై భగ్గుమన్న బీఆర్ఎస్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు డిమాండ్ చేశారు.
- గ్రేటర్ వ్యాప్తంగా మున్సిపల్కార్యాలయాల వద్ద ఆందోళన
- ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్
BRS | సిటీబ్యూరో:ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఫీజు ప్రజలపై భారం పడుతుందని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలంటూ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, హెచ్ఎండీఏ కార్యాలయంతో పాటు జోనల్, శివారు మున్సిపల్ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బూటకపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చాక ప్రజలపై భారం మోపే నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. ప్రస్తుత మంత్రులు గతంలో ఎల్ఆర్ఎస్పై అనేక రకాల ప్రకటనలు చేశారని, ఫీజు అవసరం లేకుండానే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటనలు చేశారని, దానిని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

