గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయంప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు డిమాండ్ చేశారు.