Uppal | చర్లపల్లి, ఆక్టోబర్ 12 : ఉప్పల్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్లో డివిజన్ కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌తో కలిసి డివిజన్ నాయకులు, కార్యకర్తలతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం, ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు రెండు నెలల పాటు పనిచేసి గెలిపిస్తే ఐదేండ్లు సేవ చేసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు చర్లపల్లి డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో భగవాన్ కాలనీ, శ్రీకృష్ణానగర్, రెడ్డి కాలనీ వాసులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ పావనీమణిపాల్‌రెడ్డి, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.