సిటీబ్యూరో: ఎలతుర్తిలో 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక సభ జరగబోతున్నదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలతో నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లపై తలసాని సమీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కేపీ వివేకానంద్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
చలో వరంగల్ పోస్టర్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిషరించారు. కాంగ్రెస్ అనేక మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజల ఆగ్రహానికి గురవుతున్నదని తలసాని విమర్శించారు. తిరిగి కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కశ్మీర్‌లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.