మేడ్చల్, జనవరి1(నమస్తే తెలంగాణ): దేశమంతటా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టించడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో దేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటూ తిరుమలకు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి శ్రీవారిని సోమవారం దర్శించుకోనున్నట్లు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అమలు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. వివిధ రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ను దేశానికి నాయకత్వం వహించేలా బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.