నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాముయాదవ్ ఆధ్వర్యంలో కొత్తగా ముద్రించిన బీఆర్ఎస్ మలక్‌పేట నియోజకవర్గ క్యాలెండర్‌ను శనివారం నియోజకవర్గ ఇన్చార్జి ఆజం అలీతో కలిసి మినిష్టర్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్, డైరెక్టర్లు రాము యాదవ్, యాదగిరి, రాహుల్, అభిషేకం, సల్మాన్, నాయకులు బాబు సుదర్శన్, డివిజన్ అధ్యక్షుడు కామేశ్, నక్క అమరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.