శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 8: చలో వరంగల్‌కు లక్షలాదిగా తరలిరావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రజతోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ అభివృద్ధికి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తే.. అదే రేవంత్‌రెడ్డి వినాశనం చేస్తున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును వరంగల్ సభలో ఎండగడుతామన్నారు. జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నదన్నారు.
ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రైతు బంధు జిల్లా మాజీ చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, రాజేంద్రనగర్ నియోజవకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, శంషాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరక్టర్ సతీశ్, మాజీ ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్పాషతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.