నమస్తే నెట్వర్క్ : జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరించింది.. ఖమ్మం వేదికగా నేడు గర్జించనున్నది.. ఇక నుంచి దేశ రాజకీయాలను శాసించనున్నది.. బీఆర్ఎస్ మొట్టమొదటి బహిరంగ సభకు ‘స్తంభాద్రి’ నగరం ముస్తాబైంది.. పార్టీ జెండాల రెపరెపలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నది.. సభకు లక్షలాది మంది ప్రజలు, రైతు సంఘాల నాయకులు హాజరుకానున్నారు.
బుధవారం ఖమ్మం శివారులోని జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, విజయన్, భగవంత్‌మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జాతీయ రాజకీయాలకు నాంది పలుకనున్నారు. సభ ఏర్పాట్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, సభ ఇన్చార్జి తన్నీరు హరీశ్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చేశారు.
వలంటీర్లకు సూచనలిస్తున్న మంత్రి అజయ్‌కుమార్, చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి
కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల కవాతు
గులాబీ జెండాలు, విద్యుత్ కాంతులతో ఖమ్మం నగరం