రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి శూన్యమై కేవలం కూల్చివేతల పర్వం కొనసాగుతోందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ విసృ్తత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిస్తే, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల కడుపు కొడుతోందని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వం శేరిలింగంపల్లిలోనే దాదాపు 4వేల మందికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నగరంలో పేదవాడికి ఒక ఇల్లైనా కట్టిం చిందా అని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలదోస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.
– సిటీబ్యూరో

సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ)కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పరిస్థితి నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మైసూర్ బోండాలో మైసూర్ ఎంత ఉంట దో, రేవం త్ రెడ్డి మాటల్లో నిజం కూడా అంతే ఉంటది అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలు ఇస్తే.. తాము తులం బంగారం ఇస్తామని నమ్మబలికిన కాంగ్రె స్, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. తుగ్లక్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ఎప్పుడు వస్తారా? అని రైతులు, యువకులు, ఆడబిడ్డలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారన్నారు.
2028లో మళ్లీ కేసీఆర్ ప్రగతి భవన్లో అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మాఫియాను తరిమికొట్టేందుకు శేరిలింగంపల్లి నుంచే బీఆర్ఎస్ శ్రేణులు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ హైదరాబాద్ వస్తే ఇది హైదరాబాద్ ఆ ? లేక న్యూయార్ నగరమా? అని ఆశ్చర్యపోయేలా ఫె్లైఓవర్లు, అండర్ పాస్ లు, బ్రిడ్జిలతో నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో 20వేల లీటర్ల వరకు ఉచిత తాగునీరు, 24 గంటల నిరంతర విద్యుత్ అందించడమే కాకుండా, నగరంలో 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

మెట్రోను అటకెకించారు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 72 కిలోమీటర్ల మేర మెట్రో రైలును నిర్మించిందని, రాయదుర్గం నుంచి శేరిలింగంపల్లి మీదుగా ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 2023 జూన్-జూలై నాటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందని కేటీఆర్ తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి రాగానే తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం ఎయిర్ పోర్ట్ మెట్రోను రద్దు చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడే ఆ ప్రాజెక్ట్ కొనసాగి ఉంటే ఈ పాటికే మెట్రో పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు మొండిచేయి చూపిందని, లక్డీకాపూల్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో ప్రతిపాదనలను ట్రాఫిక్ లేదనే సాకుతో తిరసరించిందని దుయ్యబట్టారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఢిల్లీలో కొత్త డ్రామాలకు తెరలేపారని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్‌తోనే రాష్ట్రం ప్రగతి పట్టాలు
హైదరాబాద్ నగరం మరింత విస్తరించాలన్నా, ట్రాఫిక్ సమస్యలు తీరాలన్నా, మరో 250 కిలోమీటర్ల మేర మెట్రో రైలు రావాలన్నా అది కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పెద్దపెద్ద మాటలు చెప్పే ఈ బుడ్డర్ ఖాన్, తీస్మార్ ఖాన్ల వల్ల ఎలాంటి అభివృద్ధి జరగదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను ప్రగతి పథంలో నడిపించాలన్నా, మళ్లీ మెట్రో పట్టాలెకాలన్నా 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి తీరాల్సిందే అని అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారంతా అవకాశవాదులు
అధికారం లేదని గోడలు దూకే వారంతా అవకాశవాదులే తప్ప నిజమైన కార్యకర్తలు కాదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్యకర్తల చెమట, కష్టంతో గెలిచిన కొందరు నాయకులు ఈరోజు రేవంత్‌రెడ్డి సంకలో కూర్చున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రూ.9,500 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, ఆ విషయాలను గతంలో ఇక్కడి ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పోతే పోయారు… కానీ కారు కు అసలైన డ్రైవర్లు, దానిని నడిపించే శక్తులు బీఆర్ఎస్ కార్యకర్తలే. మీరే ఈ పార్టీకి పునాది రాళ్లు అని కార్యకర్తల్లో భరోసా నింపారు.
దళపతిగా కేసీఆర్ ఉన్నారని, ఆయన సైన్యంగా కార్యకర్తలు ఉన్నంతవరకు పార్టీకి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం అన్నారు. అబద్ధాలు, మోసాలతో ఎకువ కాలం రాజకీయం చేయలేరని, కాంగ్రెస్ వైఖరిపై ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, జగదీష్‌రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబ, జూపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్ రావు పాల్గొన్నారు.
