KCR | సికింద్రాబాద్/ఉప్పల్/కాచిగూడ/రామంతాపూర్/యాచారం/నిజాంపేట/ఎల్బీనగర్/కొండాపూర్/సైదాబాద్ /మేడ్చల్ కలెక్టరేట్/ఎల్బీనగర్/కుత్బుల్లాపూర్/ ఎర్రగడ్డ/జియాగూడ/మైలార్‌దేవ్‌పల్లి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద ఈ వేడులను బీఆర్ఎస్ శ్రేణులు అంగరంగ వైభవంగా జరిపాయి. కేక్ కట్ చేసి.. స్వీట్లు తినిపించుకున్నారు. పలు ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయగా.. మరికొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
సీతా ఫల్ మండిలోని ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు కార్పొరేటర్ హేమ పరీక్ష ప్యాడ్స్,పెన్నులు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నామలగుండు లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ప్రజలకు సేవలందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలగూడ పార్క్ లో మొక్కలు నాటారు సీతాఫల్మండి రెయిన్బో అనాథ ఆశ్రమంలో చిన్నారుల మధ్య తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లూరి అనిల్, జీహెచ్ఎంసీ అధ్యక్షుడు గుండు దయానంద్, గంగపుత్ర, కో కన్వీనర్ జగన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నరసింహ చారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఉప్పల్ చిలుకానగర్ చౌరస్తాలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, మిఠాయిలు పంచారు. ఉప్పల్ డివిజన్లో పిల్లి నాగరాజు ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అత్తాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. చిన్నారులకు స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
కాచిగూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దుల ఓం ప్రకాశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కార్యాలయం వెంకటేశ్ హాజరై కేక్ కట్ చేశారు. కాచిగూడలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగేందర్ బాబ్జి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి.. బాటసారులకు పంపిణీ చేశారు. రామాంతపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్న నాగేశ్వరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. అనంతరం గోకుల్‌నగర్ బృందావన్ గార్డెన్లో మొక్కలు నాటారు. నిజాంపేటలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, నాయకులు కేక్ కట్ చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలోని ఆదర్శ అనాథ ఆశ్రమంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి అల్పాహారం, పండ్లు, ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.
యాచారంలో..
ఖాజాగూడలోని స్పర్శ హాస్పిటల్‌లోని రోగులకు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పండ్లు పంపిణీ చేశారు యాచారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో యాచారం మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు. కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న పలువురు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. సైదాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పగిళ్ల శ్రీనివాసరెడ్డి, సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. మేడ్చల్ సమీపంలోని నాగారం మున్సిపాలిటీ వెస్ట్ గాంధీనగర్‌లోని మానస ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులకు బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్, అనంత్ రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పండ్లు పంపిణీ చేశారు. గడ్డిఅన్నారంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు.
మల్లాపూర్ వార్డు కార్యాలయం వద్ద కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి
బోరబండ ఎస్సార్టీ నగర్లో ఏర్పాటు చేసిన కేసీఆర్ భారీ కటౌట్ వద్ద బీఆర్ఎస్ నాయకులు బొట్టుశివ, ఏడీ మధు, శివ, రాము, రాజేష్, నారాయణ రెడ్డి, రమేష్, వెంకట్రావు, తులసిరాం, శేఖర్ కేక్ కట్ చేశారు. బోరబండ బస్ టెర్మినల్ చౌరస్తా వద్ద జరిగిన కేసీఆర్ జన్మదిన సంబురాల్లో భాగంగా భారీ కేకును కట్ చేశారు. డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, విద్యార్థి విభాగం నాయకుడు కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జియాగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, మిఠాయిలను బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ యాద శ్రీనివాస్ గుప్తా, పరంధాములు, నరహరి చారి, మంగి కిషోర్ కుమార్, దేవేందర్ సాగర్, ప్రకాష్ , ఆకారం శ్రీనివాస్ , అనిత పంచిపెట్టారు.
దూలపల్లిలో
కుత్బుల్లాపూర్‌లో..
దూలపల్లిలో మాజీ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మాజీ కౌన్సిలర్లు డప్పు కిరణ్ కుమార్, చింతల రవీందర్, పార్టీ సీనియర్ నేతలు చింతల దేవేందర్ తదితరులు కలిసి మొక్కలు నాటారు. కుత్బుల్లాపూర్ డివిజన్ లో వేడుకలు నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. కెసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, సీనియర్ నాయకులు కిషోర్ చారి, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు అరుణ, సురేందర్ రెడ్డి, వెంకటేశ్, జగదీశ్, సదానంద, భాస్కర్ రెడ్డి, శ్రీనాథ్, నరసింహ రెడ్డి, శ్రీనివాస్, మీసాల రాములు, లక్ష్మి, రమేశ్ యాదవ, ఆంజనేయులు,మల్లేష్,విజయ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్, పెన్నులు, రబ్బర్లు అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ, తిరుపతి,వెంకట్ రెడ్డి, ఆసియా బేగం,జహంగీర్,ప్రభాకర్, రాజు గౌడ్, రాము, భారత్, రమేష్, సాయి, అంజి, కేరుబ,గోపాల్ రెడ్డి, కాజా పాషా తదితరులు పాల్గొన్నారు.