Jubilee Hills By Election | హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అన్నారు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని ఈసీని ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, దామోదర్ రావు కోరారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నందున, ఎన్నికలు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరగాల్సిన అవసరం ఉందని ఎంపీలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని.. ఈ నేపథ్యంలో అక్కడ మహిళా అధికారులను నియమించాలని, లేదంటే దొంగ ఓట్లకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎంపీలు కె.ఆర్. సురేష్ రెడ్డి, దామోదర్ రావు.
♦️ ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు.
♦️ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.
♦️… pic.twitter.com/e1AkHQz6PR
— BRS Party (@BRSparty) November 7, 2025