సికింద్రాబాద్ పార్లమెంట్లో లక్ష మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని, ఇప్పటికే 11 శాతం ముందంజలో ఉన్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కేసీఆర్ నన్ను పిలిచి ఎంపీగా నిలబడు అని చెప్పి పంపించాడన్నారు.సికింద్రాబాద్ అసెంబ్లీ ప్రజల కష్ట సుఖాల్లో ఎలాగైతే ఉన్నానో.. పార్లమెంట్లో కూడా ప్రజల హక్కుల కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.
నాడు గల్లీలో గెలిసినం..నేడు ఢిల్లీలో గెలుస్తామన్నారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు కార్పొరేటర్ ఎన్నికలప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారని పద్మారావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, నాంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి ఆనంద్ గౌడ్, మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని లక్ష్మీప్రసన్న, కంది శైలజ, రాసురి సునీత, పార్టీ సీనియర్ నాయకులు రామేశ్వర్ గౌడ్, కిశోర్ గౌడ్, కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.