Deshapati Srinivas | సికింద్రాబాద్ అస్తిత్వం కోసం చేపట్టిన శాంతిర్యాలీని అడ్డుకోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. నిర్బంధాల పడగ నీడలో క్రూర పాలన కొనసాగుతోందని విమర్శించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో దేశపతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. లష్కర్ అంటేనే కవాతు అని తెలిపారు. సికింద్రాబాద్‌ను జిల్లా చేసేదాకా ఈ కవాతు ఆగదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బిడ్డలకు హక్కులు ఉండవా అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్‌కు తరతరాల చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చారిత్రక వారసత్వం ఉందని అన్నారు. సికింద్రాబాద్‌తో మాది మట్టి బంధమని తెలిపారు. మా తల్లిదండ్రుల పేర్లు మార్చు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.