Talasani Srinivas yadav | హైదరాబాద్ : ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నాను అంటూ అండగా నిలిచే మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మోండా మార్కెట్లో షాపులు కూలి నష్టపోయిన 6 టైలరింగ్ కుటుంబాలను తలసాని ఆదుకున్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో వ్యక్తిగతంగా రూ. 20 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు.
ఈ నెల 24 వ తేదీన మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా గోడ కూలి పక్కనే ఉన్న టైలర్ షాపులపై పడటంతో 6 షాపులు కూలిపోవడం, అందులోని కుట్టు మిషన్లు, దుస్తులు, ఇతర సామాగ్రి దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే అదేరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనాస్థలికి చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని, ఆర్ధిక సహాయాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయానికి బాధిత కుటుంబాలను ఆహ్వానించి ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 70 సంవత్సరాల నుండి టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అనుకోని సంఘటనతో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఈ ఘటనలో షాపులలోని కుట్టు మిషన్లు, ఇతర సామాగ్రి కాకుండా రానున్న, దసరా, దీపావళి పండుగల సందర్భంగా స్టిచ్చింగ్ కోసం కస్టమర్లు ఇచ్చిన దుస్తులు కూడా మట్టి శిధిలాల్లో కలిసిపోయాయని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సంఘటన జరిగిన రోజునే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడంతో రెవెన్యూ అధికారులు ప్రమాదస్థలికి చేరుకొని పంచనామా కూడా నిర్వహించారు. బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కై లాబ్ యాదవ్, నాగులు, రాములు, మహేందర్, మహేష్, జయరాజ్, మేరు సంఘం నాయకులు శ్రీనివాస్, వెంకటేష్, కృష్ణ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Rangareddy | రంగారెడ్డి కలెక్టరేట్లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..
HYDRAA | కంటి మీద కునుకులేదు కడుపు నిండ తిండిలేదు.. హైడ్రా రాకతో బిక్కుబిక్కుమంటున్న పేదలు
Crime News | మహిళల వేషధారణలో వేధింపులు.. పురుషుల గ్యాంగ్ అరెస్ట్