MLA Talasani | బేగంపేట, మార్చి 5 : ప్రజలకు మేలు జరిగే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బుధవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బన్సీలాల్‌పేట డివిజన్‌కు చెందిన 7 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలలో ఆడపడుచు పెండ్లి ఆర్థికంగా ఎంతో భారంతో కూడుకున్నదని పేర్కొన్నారు. వారికి కొంత చేయూతను ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వం లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించే గొప్ప కార్యక్రమం ప్రారంభించిందని చెప్పారు. అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐలు సత్య ప్రసాద్ రావు, ప్రణీత్ రావు, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేషన్ రాజు, ఆకుల హరికృష్ణ, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్ కుమార్, మహేష్ కుమార్ యాదవ్, గజ్జెల శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.