MLA Talasani | బేగంపేట్, మే 24 : సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ది పొందాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని 44 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి(26), షాదీముబారక్(18) ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే లబ్ధిపొందిన వారు తమ పరిసరాలలోని అర్హులైన వారు లబ్ధిపొందే విధంగా అవగాహన కల్పించాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరిగేలా అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టి.మహేశ్వరి, కుర్మ హేమలత, తహసీల్దార్ పాండు నాయక్, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు శ్రీహరి, కిషోర్, ఏసూరి మహేష్, నరేందర్, నాగులు, ఆరీఫ్, ప్రేమ్ కుమార్ ఆంజనేయులు, శేఖర్, మహేష్, లక్ష్మీపతి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.