Holi | మారేడ్పల్లి, మార్చి 14: మోండా డివిజన్ బండిమెట్లో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలు జరుపుకున్నారు. హోలీ వేడుకల్లో చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా యువతీ, యవకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సహాలతో కేరింతలు కొట్టారు. మోండా డివిజన్ బండిమెట్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జి. నాగేందర్ (నాగులు) ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ హోళీ అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ, శ్రీనాథ్, వెంకట్, అమర్ తదితరులు పాల్గొన్నారు.