MLA Sudheer Reddy | మన్సురాబాద్, జూలై 6 : సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేద కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మనసురాబాద్ డివిజన్ హయత్ నగర్ పరిధి, లెక్చరర్స్ కాలనీకి చెందిన క్రాంతి కుమార్ కూతురు యశస్విని పుట్టినప్పటినుంచి ఎదుగుదల బాధపడుతుండగా ఆమెను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానాలో చేర్పించారు. చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయ నిధి నుంచి రూ. 1.10 లక్షలు మంజూరు చేయించారు. సదరు ఎల్ఓసి పత్రాన్ని ఆదివారం చిన్నారి తండ్రి క్రాంతి కుమార్కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిదని.. పేద ప్రజలకు నాణ్యమైన అధునాతనమైన వైద్య సేవలను పొందేందుకు సీఎం సహాయనిది అండగా ఉంటుందన్నారు.