చంపాపేట, జూలై 3 : పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చిలుకల బస్తీకి చెందిన నిఖిత కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతూ… వైద్యం కోసం ఓ హాస్పిటల్ లో చేరింది. కానీ వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆ హాస్పిటల్ ఖర్చులు భరించే స్థోమత లేక వారి కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిసి తాము ముఖ్యమంత్రి సహాయ నిధి పొందే విధంగా సహకరించాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే స్పందించి గత కొన్ని రోజుల క్రితం వారి చేత ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ఇందుకుగాను వారికి రూ. 1,50,000 మంజూరు అయ్యాయి. అట్టి చెక్కును గురువారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.