Teegala Ranjith Reddy | బడంగ్పేట్, జూన్ 12 : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ తీగల రంజిత్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు.. రంజిత్ రెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండుసార్లు ఎంపీటీసీగా ఎంపికై ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఆమె గుర్తు చేశారు. సేవా దృక్పథంతో రంజిత్ రెడ్డి పనిచేసేవారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఒంటి చేతితో మీర్పేట్లో ఎంపీటీసీలను, వార్డు మెంబర్లను గెలిపించుకున్న ఘనత రంజిత్ రెడ్డికి ఉందన్నారు. చిన్న వయసులోని రంజిత్ రెడ్డి మరణించడం బాధాకరమన్నారు.
ఈ కార్యక్రమంలో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, మేకల రవీందర్ రెడ్డి, అనిల్ యాదవ్, దీప్లాల్ చౌహాన్, సిద్దాల అంజయ్య, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అశోక్, ఎల్చాల సుదర్శన్ రెడ్డి, రామిడి రామిరెడ్డి, పెద్దబావి ఆనంద్ రెడ్డి, సమ్‌రెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్‌కుమార్, వీర రాఘవరెడ్డి, మహిళా అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు.