MLA Sabitha | బడంగ్‌పేట, ఫిబ్రవరి 16 : సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని ఉప్పుగడ్డ తండా, లెనిన్ నగర్, మీర్‌పేటలో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. గిరిజన సంఘాల నాయకులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని గిరిజన వస్త్రా అలంకరణలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని ఆమె పేర్కొన్నారు. గిరిజన తండాలను గిరిజనులే పాలించుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి బంజారాహిల్స్‌లో గిరిజన భవనం ఏర్పాటు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరిగిందన్నారు. గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం గిరిజనుల గురించి పట్టించుకోలేదన్నారు. గిరిజనుల బాధలు చూసిన తర్వాత కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. మహేశ్వరంలో కోటి రూపాయలతో దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగిందన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్, సత్య సాయి నగర్ సేవాలాల్ భవనం కోసం స్థలం కేటాయించడం జరిగిందన్నారు. గిజనుల సమస్యలను పరిష్కారం చేయడం జరిగిందన్నారు. సేవాలాల్ చేసిన మంచి పనులను రేపటి తరాలకు అందించవలసిన అవసరం ఉందన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దుర్గ, మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు అనిల్ కుమార్ యాదవ్, సిద్ధల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, రవి నాయక్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీను నాయక్,, తదితరులు ఉన్నారు.