MLA Padma Rao | సికింద్రాబాద్, ఫిబ్రవరి22 : నిరుపేదలు నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడకు చెందిన బాలమణి, మంజుల వైద్య సహాయానికి రూ.3.50 లక్షల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధుల మంజూరు పత్రాలను పద్మారావు గౌడ్ శనివారం సీతాఫల్ మండిలోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు.
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సీతాఫల్ మండిలోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు సుంకు రామచందర్, బాలరాజు గౌడ్, అశ్విన్, శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.